కృష్ణా నదిలో ఇసుక తవ్వితే చర్యలు : పల్నాడు కలెక్టర్‌

Feb 13,2024 23:27

ప్రజాశక్తి – అచ్చంపేట : ప్రభుత్వ అనుమతులు లేకుండా కృష్ణా నదిలో ఇసుక తవ్వితే చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శిశంకర్‌ అన్నారు. మంగళవారం అచ్చంపేట మండల పరిధిలోని కోనూరు ఇసుక రీచ్‌ల వద్ద కృష్ణానదిని ఆయన పరిశీలించారు. జిల్లా సరిహద్దు మ్యాప్‌ను చూసిన అనంతరం మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ ఆదేశాల ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకూడదని చెప్పారు. పల్నాడు జిల్లా పరిధిలో కృష్ణా నది వెంబడి 11 ఇసుక రీచ్‌ లో ఉన్నాయని, ఆరు చోట్ల ఇసుక నిల్వలున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ప్రతిరోజు రీచ్‌లను పర్యవేక్షించలేదని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. కృష్ణా జలాల బోర్డులు, పర్యావరణ అనుమతులు ఇచ్చేంతవరకు డివిజన్‌ మండల స్థాయి రెవెన్యూ అధికారులదే ఈ బాధ్యతన్నారు. ఇదిలా ఉండగా కోనూరు లంక భూముల సమస్యలపై రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

➡️