ప్రజాశక్తిగీవిజయనగరం టౌన్ : రాష్ట్రంలో మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం, మత్తు పదార్థాలు,గ గంజాయి వంటి వాటి వల్ల రాష్ట్రంలో అనేక నేరాలకు యువత పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వమే మద్యం నియంత్రించే విధంగా, ప్రభుత్వమే మద్యం దుఖానాలు నిర్వహించాలన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఐద్వా నాయకులు వి.లక్ష్మి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.