గిరిజనులకు మేలు చేయని సిఎం జగన్‌

Feb 13,2024 21:59
ఫొటో : మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య

ఫొటో : మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య
గిరిజనులకు మేలు చేయని సిఎం జగన్‌
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గిరిజనులకు ఉద్ధరించిందేమీ లేదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య విమర్శించారు. మంగళవారం కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కావ్య క్రిష్ణారెడ్డి ఆదేశాలతో కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లయ్య మాట్లాడుతూ నాలుగున్నర యేళ్లుగా ఈ రాష్ట్రం దుర్మార్గుల పాలైందని, ప్రతిఒక్కరూ తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక్క అవకాశం అనే జగన్‌మోహన్‌ రెడ్డి అభ్యర్థనను నమ్మి ప్రజలు ఓటు వేసి మోసపోయారన్నారు. జాబ్‌ క్యాలండర్‌ లేక నిరుద్యోగులు అర్ధాకలితో ఆలమటించే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. టిడిపి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో 35లక్షల మంది గిరిజనులు ఉంటే వారికి సంబందించిన 16 సంక్షేమ పధకాలు రద్దు చేసి, గిరిజనుల కడుపు కొట్టి, జగన్‌ రెడ్డి గిరిజనులకు ద్రోహం చేశాడన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు మొత్తం ఏకమై ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ బాబు, నాయకులు గుండ్లపల్లి మురళి, శివ, అంబటి కిషోర్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.

➡️