గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: జగనన్న కాలనీ గృహ నిర్మాణ లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవో ఎం శ్రీహరి కోరారు. శుక్రవారం సంతనూతలపాడులోని జగనన్న కాలనీలో గృహ నిర్మాణ లబ్ధిదారులతో ఆయన సమావేశమయ్యారు. వివిధ స్థాయిలో ఉన్న గృహ నిర్మాణాలను వేగవంతంచేసి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్‌ ఆఫీసర్‌, డిఎల్‌డివో ఉషారాణి గ్రామ సర్పంచ్‌ దర్శి నాగమణి, ఎంపీపీ బి విజయ, జడ్పిటిసి దుంపా రమణమ్మ, హౌసింగ్‌ ఏఈ ఎం వెంకటస్వామి గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్‌ ప్రతాప్‌ కుమార్‌, వెలుగు సిసి లక్ష్మి, వివోఏలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️