గెలిపిస్తే అభివృద్ధి చేస్తా : బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి : ఐటి, నాన్‌ ఐటి ఉద్యోగులు ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. హైదరాబాదులోని కూకటపల్లి హౌసింగ్‌ బోర్డులోని పంక్షన్‌ హాలులో హైదరాబాదులో ఉద్యోగం నిర్వహిస్తున్న దర్శి నియోజక వర్గ పరిధిలోని ఐటి, నాన్‌ఐటి ఉద్యోగులతో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటి సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. తనను దర్శి నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ప్రకటించినట్లు జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఐటి ఉద్యోగులు తన గెలుపు కోసం కృషి చేయాలన్నారు. తనను గెలిపిస్తే అండగా ఉంటానని తెలిపారు.దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత వైఎస్‌ఆర్‌, బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సతీమణి నందిని, ఐటి, నాన్‌ఐటి ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️