గ్రామాల్లో ‘జన విజయ యాత్ర’

Apr 2,2024 20:53

ప్రజాశక్తి- డెంకాడ : మండలం లోని గుణుపూరుపేట, ఆర్‌.ముంగినాపల్లి, కె.ముంగినాపల్లి, రెడ్డిక పేటలో ‘జన విజయ యాత్రలో’ భాగంగా గడపగడపకు తిరిగి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని జనసేన, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి కోరారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని కోరండంతో ప్రజలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మినాయుడు, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, పూసపాటి రేగ టిడిపి మండల అధ్యక్షులు మహంతి శంకర్రావు, రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవి శేఖర్‌, అల్లాడపాలెం మాజీ సర్పంచ్‌ లంకలపల్లి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్‌ కోఆర్డినేటర్‌ తుమ్మలక్ష్మీ రాజ్‌, విక్రమ్‌ జగన్నాథం, కోనైపాలెం ఎంపిటిసి పసుపులేటి గోపి, జనసేన పార్టీ మండలం సీనియర్‌ నాయకులు పతివాడ శ్రీనివాస్‌, చిన్న రాము, పైలా శంకర్‌, అట్టాడ ప్రమీల, తొత్తడి ప్రకాష్‌, దిండి రామారావు, కోరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️