ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

Mar 31,2024 21:02

ప్రజాశక్తి – రామభద్రపురం : మండలంలోని ఉన్న అన్ని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్యంగా శతాబ్ద కాల చరిత్ర కలిగిన ఆరికతోట ఏడిఎంఎం బాప్టిస్ట్‌ చర్చ్‌లో సంఘకాపరి సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో యేసయ్య ప్రార్దనలు, గీతాలు ఆలపిస్తూ బైబిల్‌లో పేర్కొన్న వివిధ ప్రబొదనలు, సువార్త చదివి వినిపించారు. ఈస్టర్‌ దినం అతి పవిత్ర దినమని, సమస్త మానవాళి రక్షణార్ధం శిలువలో మరణించిన 3రోజుల పిదప తిరిగి ఈ పవిత్ర దినాన్న మృత్యువును జయించి తిరిగి లేచారని ఆ సందర్భంగా ఏటా పునారుద్దాన పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ ప్రార్దనల్లో ముఖ్య అతిధి మాజీ సర్పంచ్‌ పెంకి భీమయ్య, చర్చి ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, సెక్రెటరీ జార్జ్‌ ఎబి నైజర్‌, ట్రెజరర్‌ ఆదియ్య, గ్రామ సర్పంచ్‌ పెంకి పుష్పమ్మ, వందలాది మంది ప్రభు భక్తులు పాల్గొన్నారు.బొబ్బిలి: పట్టణంలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబిఎం చర్చిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పాల్గొని ప్రార్థనలు చేశారు. శాంతి, కరుణకు మారుపేరుగా యేసుక్రీస్తు నిలిచారని శంబంగి అన్నారు. క్రీస్తు మరణాన్ని జయించి లేచారని కారుణ్య ఫౌండేషన్‌ అధ్యక్షులు జేసీ రాజు అన్నారు. అన్ని చర్చిలలో ప్రార్థనలు చేశారు.విజయనగరం టౌన్‌: నగరంలో ఈస్టర్‌ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్‌ ఈస్టుకోస్టు జ్యూట్‌మిల్లు, బాలాజీ మార్కెట్‌ ప్రాంతాల్లో క్రైస్తువులు తెల్లవారు జామున సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

➡️