ఘనంగా 1104 యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవం

Feb 12,2024 20:22

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 74ఏళ్లు పూర్తి చేసుకొని 75 వ వసంతంలో అడుగుపెడుతున్న విద్యుత్‌ శాఖ ఉద్యోగుల 1104 యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. స్థానిక 1104 యూనియన్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా యూనియన్‌ జెండాను సీనియర్‌ నాయకులు రాజేంద్ర ప్రసాద్‌ ఎగురవేశారు. అనంతరం వేడుకలను విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఎం.లక్ష్మణరావు ప్రారంభించారు. యూనియన్‌ ఏర్పడిన తరువాత ఉద్యోగులు అనేక హక్కులు సాధించుకోవడంతో పాటు, విద్యుత్‌ శాఖ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. యూనియన్‌ ఇన్నేళ్లు నడపడమంటే చిన్న విషయం కాదని, ఉద్యోగుల ఐక్య మత్యానికి నిదర్శనమని అన్నారు. అనంతరం కాంట్రాక్ట్‌,ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర నాయకులు నాగరాజు, జిల్లా కార్యదర్శి సురగాల లక్ష్మణరావు,డివిజనల్‌ అధ్యక్ష, కార్యదర్శులు అప్పారావు, దేముడు, పైడిరాజు, రమణ, రాము, మల్లేష్‌, శ్రీనివాస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️