చల్లా శ్రీనివాస్‌ సేవలు అభినందనీయం

ప్రజాశక్తి-చీమకుర్తి : యుటిఎఫ్‌ జిల్లా నాయకులు చల్లా శ్రీనివాస్‌ విద్యాభివృద్ధికి చేసిన సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. చల్లాశ్రీనివాస్‌ ఉద్యోగ విమరణ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ బి. జవహర్‌ మాట్లాడుతూ చల్లా శ్రీనివాస్‌ గత 40 ఏళ్ళుగా చీమకుర్తి ప్రాంతంలోని పలు పాఠశాల పనిచేసినట్లు తెలిపారు. అనేక మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారన్నారు. చీమకుర్తి సిఐ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. చల్లా శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. అనంతరం చల్లా శ్రీనివాస్‌ పద్మావతి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గోపురపు రాజ్యలక్ష్మి, యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్‌ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి డిజ వీరాంజనేయులు, .టిడిపి బాపట్ల నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మన్నం ప్రసాద్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరాస్వామి, ఎంఇఒలు వెంకటేశ్వర్లు, శివాజీ, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు కె. రాఘవరావు,చల్లా అంకులు, టిడిపి నాయకులు గొట్టిపాటి రాఘవరావు,కందిమళ్ళ గంగాధరరావు, పూనాటి వెంకటరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కె. అక్బర్‌, చలువాది శ్రీను, ఎస్‌టియు నాయకుడు డి.నాగయ్య, విద్యుత్‌ ఏడీ చల్లా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️