చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు

Apr 2,2024 20:51

ప్రజాశక్తి- బొబ్బిలి : చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి కోరారు. పట్టణంలోని మిలటరీ కాలనీ, బోస్‌ నగర్‌, రాజ్‌ మహల్‌, రామన్నదొరవలసలో మంగళవారం పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని కోరారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్య కార్మికులకు చెత్త ఇవ్వాలని ప్రజలను కోరారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్మికుల పనిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో మున్సిపల్‌ ఎఇ సురేష్‌, శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. నిర్వహణ మెరుగుపరచాలిమున్సిపాలిటీలో వీధి దీపాలు, కుళాయిలు నిర్వహణ మెరుగుపరచాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి కోరారు. మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సచివాలయ సెక్రటరీ వారివార్డులో వీధి దీపాలు, కుళాయి నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. వార్డులలో కుళాయి కనెక్షన్లు, వీధి దీపాలు, మంచినీటి బావులు, చేతిపంపు బోర్లు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని కోరారు. వాటి పనితీరుపై నివేదిక ఇవ్వాలన్నారు. వార్డులలో ఏ అభివృద్ధి పనులు చేయాలో గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ డిఇ రవికుమార్‌, ఎఇ సురేష్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️