జగనన్న సురక్షకు స్పందన కరువు

ప్రజాశక్తి – చెన్నూరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్షను మంగళవారం చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. రోగులు తక్కువ.. వైద్యులు ఎక్కువగా సామెతగా ఉంది. అధి కారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమం గురించి ముందుగా ప్రజలకు చెప్పకపోవడమే కారణమని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరికీ కార్పొరేట్‌ వైద్యం అందించడమే ముఖ్యమంత్రి జగనో ్మహన్‌ రెడ్డి ఆశయమని, కార్యక్రమాన్ని నీరు కారుస్తున్నట్లు స్థాని కులు వాపోతున్నారు. ఎవరూ సురక్ష కార్యక్రమానికి హాజరు కాకపో వడంతో ఖాళీ కుర్చీలు దర్శమిచ్చాయి. కార్యక్రమానికి స్థానిక అధి కార పార్టీ ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడమూ చర్చనీ యాంశమైంది. కార్యక్రమంలో చిన్నూరు గ్రామ పంచాయతీ కార్య దర్శి రామ సుబ్బారెడ్డి, డాక్టర్‌ చెన్నారెడ్డి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️