‘జగన్‌ సర్కారు అరాచకాలకు చరమగీతం’

ప్రజాశక్తి-మదనపల్లి జగన్‌ సర్కారు అరాచకాలను అంతమొందించేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం పూరించారని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంఖారావం పేరుతో పర్యటిస్తూ ప్రజలకు జగన్‌ చేస్తున్న దౌర్జన్యాలను తెలియచేస్తూ, ప్రజలకు భరోసా కల్పించేలా శ్రీకారం చుట్టారని తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు గాలి చలపతి నాయుడు, పట్టణ అధ్యక్షులు జోలేపాలెం భవాని ప్రసాద్‌, మండల అద్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు యర్రబల్లి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్‌ అరాచకాలకు చరమగీతంం పాడటం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కడపలో టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, మాధవరెడ్డిలతో పాటు అతని కుటుంబ సభ్యులు, పార్టీ క్యాడర్‌ మీద కత్తులతో దాడులు చేయడం, ఎర్రదొంగలు కానిస్టేబుల్‌ గణేష్‌ను వాహనంతో ఢ కొట్టి చంపేయడం చూస్తుంటే రాష్ట్రంలో పోలీసులకే భద్రత లేకుండా పోయిందన్నారు. రాయచోట : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, వైసిపి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు పూరించిన నాధమే ‘శంఖారావం’ అని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌ మోహన్‌ రాజు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకే తెలుగుదేశం పార్టీ ‘శంఖారావం’ అనే కీలక ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు .ఈ పర్యటనతో నారా లోకేష్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారని తెలియజేశారు. ఇప్పటికే యువగళం పాదయాత్ర ద్వారా జగన్‌రెడ్డి ప్రభుత్వం అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజలకు వివరించారని, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న యువతకు భరోసానిస్తూ పాదయాత్ర సాగించారని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని అయన తెలియజేశారు. వైసిపి నాయకుల అవినీతి అన్యాయానికి వ్యతిరేకంగా 220 రోజులపాటు దాదాపు 3,132 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారని తెలియజేశారు. నారా లోకేష్‌ శంఖారావం ద్వారా పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యేలా చేస్తుందని, కార్యకర్తలు నేరుగా తమ అభిప్రాయాలను యువనేత లోకేష్‌ బాబుతో పంచుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘శంఖారావం’ యాత్ర ద్వారా సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికి లోకేష్‌ చేరువ అవుతారని తెలిపారు. ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో లోకేష్‌ పర్యటించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని,రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జోష్యం చెప్పారు.

➡️