జెఇఇ మెయిన్స్‌లో ఉత్తరాంధ్ర టాపర్‌గా శ్రీనిధి

Feb 13,2024 20:59

ప్రజాశక్తి – కొమరాడ: జెఇఇ మెయిన్స్‌ లో ఎన్‌టిఎ ర్యాంకింగ్‌లో ఉత్తరాంధ్రలో ధనుకొండ శ్రీనిధి టాపర్‌గా నిలిచింది. మండలం లోని దళాయిపేటకు ధనుకొండ శ్రీనివాసరావు, సుశీల రెండో కుమార్తె శ్రీనిధి. ఈమె జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో 300మార్కులకు 290స్కోర్‌ సాధించి 99.99 పర్సంటేజీ సాధించి ఉత్తరాంధ్రలో టాపర్‌ గానిలిచింది. భౌతిక, రసాయనశాస్త్రాల్లో వందకు వందమార్కులు, గణితంలో వందకు 99.99మార్కులు సాధించి టాప్‌లో నిలిచింది. శ్రీనిధి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. శ్రీనిధి పదో తరగతి వరకు విజయనగరంలో చదవగా, ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఎంపీసీ గ్రూపు విజయవాడలోని శ్రీచైతన్య కాలేజీలో చదువుతుంది. శ్రీనిధికి మంచి ర్యాంకు రావడంపట్ల పలువురు అభినందనలు తెలిపారు.గిరిజన విద్యార్థులు ప్రతిభ సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఆధ్వర్యంలో ఐఐటి సూపర్‌ 60కి శ్రీకాకుళం వైటిసిలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు జెఇఇ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చారు. 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా, వీరిలో 20 మంది విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌కు అర్హత సాధించారు. అత్యధిక స్కోరు సాధించిన వారిలో కొత్తూరు ఉపేంద్ర 88.98, గేదెల చైతన్య 87.14, ఆరిక ప్రశాంత్‌ 83.96, సవర స్రవంతి 78.07, బిడ్డిక ఫ్రాన్సిస్‌ 75.79, సవర అభి 71.50 మార్కులు సాధించారు. సూపర్‌ 60 ప్రారంభించిన ఐదు నెలల్లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించడంపై ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి విద్యార్థులకు, ప్రిన్సిపల్‌ బెండి మురళీబాబు, ఫ్యాకల్టీ సభ్యులైన బి.కిరణ్‌ కుమార్‌, కెవికె శ్రీకాంత్‌, వైవి వసంత కుమార్‌ బి.ప్రభాకర్‌ రావు వైటిసి కేర్‌టేకర్‌ కె. శ్రీనివాసరావు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఎన్‌.రాంబాబు సిబ్బందికి అభినందనలు తెలిపారు. విజయనగరం : పట్టణంలోని పాల్‌నగర్‌కు చెందిన నమ్మి కౌశిక్‌ కల్యాణ్‌ జెఇఇ మెయిన్స్‌లో 98.97శాతం మార్కులు సాధించాడు. కల్యాణ్‌ తండ్రి చినబాబు వ్యాపారి కాగా, తల్లి రాజ్యలక్ష్మి టిడిపి నగర మహిళా అధ్యక్షులుగా పని చేస్తున్నారు.

➡️