టిడిపితోనే బీసీల అభివృద్ధి : స్వామి

ప్రజాశక్తి-కొండపి: టిడిపితోనే బీసీల అభివృద్ధి సాధ్యమని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బీసీల సంక్షేమం కోసం గతంలో చంద్రబాబు నాయుడు పెద్దపీట వేసినట్లు తెలిపారు. స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌ కూడలి వద్దనున్న ఎన్‌టిఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల వద్ద ఆదివారం రాత్రి జయహో బీసీ సభ నిర్వహించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి గాంధీ బొమ్మ సెంటర్‌ మీదుగా , ఆర్‌టిసి బస్టాండ్‌ కూడలి వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టిఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడుత బీసీలకు రాజకీయంగా పదవులిచ్చి వారి ఎదుగుదలకు టిడిపి తోడ్పాటు నందించిందన్నారు. బీసీల ఆర్థిక, రాజకీయ , సామాజిక అభివృద్ధికి టిడిపి కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు యలమందనాయుడు, రాష్ట్ర నాయకుడు వసంతరావు, రాష్ట్ర మహిళా నాయకురాలు రావిపాటి సీతమ్మ, ఎఎంసి మాజీ చైర్మన్‌ జి.రామయ్యచౌదరి, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకుడు బత్తుల నారాయణస్వామి, నరసారెడ్డి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, దేపూరి సుబ్బారావు, కాశయ్య, బీసీ నాయకులు, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️