టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి : విజరుకుమార్‌

ప్రజాశక్తి- మద్దిపాడు : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌. విజరు కుమార్‌ తెలిపారు. మండల పరిధిలోని బూరేపల్లి గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు మండవ జయంత్‌ బాబు ఆధ్యక్షతన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజరు కుమార్‌ ఇంటింటికీ తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి పలు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండవ రంగారావు, జనసేన నాయకులు నున్నా బాల సుబ్రహ్మణ్యం, అడక స్వాములు, గ్రామ అధ్యక్షుడు బోడపాటి రామకష్ణ, సర్పంచి రాయపాటి శేషయ్య, ఉపసర్పంచి శ్రీనివాసరావు, సుబ్బారావు, శేషయ్య.,, ఎంపిటిసి భవాని,పాల్గొన్నార

➡️