టిడిపి అధికారంలోకొస్తే ఉక్కు పరిశ్రమ సాధన

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే స్టీల్‌ ప్లాంట్‌ పరిశ్రమపై శ్వేత పత్రం విడుదల చేసి సాధన కోసం కషి చేస్తామని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చదిపిరాల భూపేష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ‘కడప ఉక్కు మన హక్కు’అనే నినాదంతో భూపేష్‌ రెడ్డి స్థానిక నారాపుర స్వామి దేవాలయం నుంచి పెద్ద దండ్లూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివనాథరెడ్డి జండా ఊపి ప్రారంభించారు. అనంతరం కన్నేలూరు శివాలయం వద్ద భూపేష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలు చాలా వెనుకబడిన ప్రాంతమని విభజన హామీలు కడప హుక్కు నిర్మాణంచ రాయలసీమ అభివద్ధి కోసం నివేదిక ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. 2018లో చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేస్తే, ఇదే జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల స్టంట్‌ కోసం ఆరు నెలల ముందు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నించి,2 019 డిసెంబర్లో ఉక్కు పరిశ్రమ కోసం సున్నపురాళ్లపల్లెలో శంకుస్థాపన చేసిన జగన్మోహన్‌ రెడ్డి నాలుగున్నర సంవత్సరం గడిచిన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని పేర్కొన్నారు. సొంత జిల్లా వాసి ముఖ్యమంత్రి అయితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి లాగానే పాలిస్తారని ప్రజలు గంప గుర్తుగా నమ్మి ఓటు వేసి ముఖ్యమంత్రిని చేశారన్నారు. ఉద్యోగ అవకాశాలపై కానీ, జాబ్‌ క్యాలెండర్‌ కానీ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రాయలసీమకు ఉక్కు పరిశ్రమ తలమానికమని కొనియాడారు. అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యదర్శి డాక్టర్‌ నాగార్జున, ఎర్రగుంట్ల నేత డేరంగుల జగదీష్‌ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పిల్లలను వివిధ రకాల టెక్నికల్‌ కోర్సులు చదివించి స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. స్టిల్‌ ప్లాంట్‌ పరిశ్రమ ఎలాగో నిర్మించలేదు కనీసం గండికోట రాజోలి స్టిల్‌ ప్లాంట్‌ బాధితులకు చెల్లించాల్సిన పరిహారమైన ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూత్‌ లీడర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, పెద్దదండ్లూరు రామచంద్ర, హనుమంతు, జింకల భాష, గైబు, దువ్వూరు మురళి, తులసి రెడ్డి, రాజారెడ్డి, జమ్మలమడుగు, మైలవరం, పెద్దమడియం మండలాలకు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

➡️