టిడిపి ఆధ్వర్యంలో ‘శంఖారావం’

Feb 10,2024 21:34
ఫొటో : మాట్లాడుతున్న కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కావ్య క్రిష్ణారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కావ్య క్రిష్ణారెడ్డి
టిడిపి ఆధ్వర్యంలో ‘శంఖారావం’
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర ప్రజలకు భద్రత, భరోసా కల్పించేందుకు, జగన్‌మోహన్‌ రెడ్డి, వైసిపి నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పూరించిన రణనినాథమే ”శంఖారావం” అని కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కావ్య క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో పర్యటించి, జగన్‌రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయనున్నారని ఆయన తెలిపారు. నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతుండగా, ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నారా లోకేష్‌ రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం చేపట్టనున్నారని, ఇందులో భాగంగా రానున్న 40-50 రోజుల్లో 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్‌ పర్యటించనున్నారని తెలిపారు. ఒక్కరోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శంఖారావం ద్వారా బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికీ చేరువవుతారని తెలిపారు. ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో, పట్టణాల్లో నారా లోకేశ్‌ పర్యటించి జగన్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై, అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచారన్నారు. వైసిపి నేతల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారన్నారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్ర ద్వారా నారా లోకేష్‌ భరోసానిచ్చారన్నారు. యువగళం పాదయాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్నా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌తో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. పార్టీ కార్యకర్తలు నారా లోకేష్‌ వైపు మరింత చేరువయ్యేలా శంఖారావం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు నేరుగా నారా లోకేష్‌తో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్సులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, పమిడి రవికుమార్‌ చౌదరి, జిల్లా అధ్యక్షులు మన్నవ రవిచంద్ర, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌, కార్యదర్శి జ్యోతిబాబురావు, ఏగూరి చంద్రశేఖర్‌, పోతుగంటి శ్రీకాంత్‌, చవల రామకృష్ణ, కూరపాటి ప్రసాద్‌, ఉప్పాల శ్రీనివాసులు గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️