టీడీపీలోకి 15 చెంచు కుటుంబాలు

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, గన్నేపల్లె పంచాయతీలోని చెంచు కాలనీకి చెందిన 15 చెంచు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్బంగా అశోక్‌రెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన చెంచు కుటుంబాలకు చెందిన కుడుముల వెంకటేశ్వర్లు, మండ్ల బైరెడ్డి, చిన్న గురవయ్య, భయ్యన్న, గురవయ్య, పెద్దన్న తదితరులు ఉన్నారు.

➡️