టీడీపీలో చేరిక

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో శనివారం రాత్రి పలు కుటుంబాలు టిడిపిలో చేరాయి. కంభం మండలం ఎర్రబాలెం పంచాయతీలోని చిన్ననల్లకాల్వ గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, మరియు గిద్దలూరు మండలంలోని గుమ్ముళ్లపల్లె గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మొత్తం 30 ముదిరాజ్‌ సామాజికవర్గ బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, అశోక్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీలో చేరిన చిన్ననల్లకాల్వ గ్రామానికి చెందిన ఎన్‌ లక్ష్మయ్య, ఎన్‌ పెద్దరామయ్య, ఎన్‌ బలరామయ్య, రామయ్య, నాగన్న, ఎం వెంకటయ్య, పి తిరుపతి, ఎన్‌ లక్ష్మయ్య, టి మల్లయ్య, ఎం సుధాకర్‌, జయరాములు, రామకృష్ణ, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో బేస్తవారిపేట పట్టణానికి చెందిన సత్యేలి కృష్ణ యాదవ్‌ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సత్యేలి రంగయ్య, సత్యేలి కాశి, చెక్కా సరస్వతి, వీణ, బాదం కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు సొరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటక నరసింహయాదవ్‌, ఎంపీటీసీ సభ్యులు పూనూరు భూపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి ముప్పూరి రామయ్య, యువకులు పాల్గొన్నారు.

➡️