డంపింగ్‌ యార్డును తనిఖీ చేసిన కమిషనర్‌

Feb 10,2024 22:07

డంపింగ్‌ యార్డును తనిఖీ చేసిన కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక సంస్థ డంపింగ్‌ యార్డును కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ శనివారం ఉదయం తనిఖీ చేశారు. డంపింగ్‌ యార్డ్‌లో వ్యర్ధాల నిర్వహణను పరిశీలించారు. డంపింగ్‌ యార్డులో ముందుకొచ్చిన వ్యర్ధాలను సత్వరం వెనక్కి తరలించాలన్నారు. వ్యర్ధాలన్నీ ఎందుకిలా ముందుకు వచ్చాయని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వ్యర్ధాలను క్రమపద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. డంపింగ్‌ యార్డులో వ్యర్ధాల ప్రాసెసింగ్‌ పకడ్బందీగా చేపట్టాలన్నారు. విండ్రో కంపోస్ట్‌, వర్మీ కంపోస్ట్‌ యూనిట్లను పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను చిన్న ముక్కలుగా కొత్తరించే పల్వరైజేషన్‌ యంత్రం, ఇతర యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. డంపింగ్‌ యార్డ్‌ ఖాళీ స్థలంలో సేంద్రియ వ్యవసాయం జరుగుతున్న తీరును పరిశీలించి, కూరగాయల సాగును విస్తరించాలన్నారు. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య పాల్గొన్నారు.

➡️