తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ‘చింతల’

ప్రజాశక్తి-వాల్మీకిపురం వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ భవనంలో వైస్‌ ఎంపిపి వెంకటరమణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ కార్డులు త్వరతిగతిన లబ్ధిదారలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఖాతిజున్‌ కుఫ్రా, ఎంపిడిఒ సుధాకర్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి కిరణ్‌ కుమార్‌, సర్పంచ్‌ గంగులమ్మ, ఆర్‌బికె చైర్మన్‌ నీళ్లభాస్కర్‌, వివిధశాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

➡️