త్వరలో భవిష్యత్‌ ప్రణాళిక ప్రకటిస్తా

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : నాలుగు, ఐదు రోజుల్లో తన భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే, వైసిపి నాయకుడు కదిరి బాబూరావు తెలిపారు. మండల పరిధిలోని శీలంవారిపల్లిలోని తన నివాస గహంలో తన అభిమానులతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కనిగిరి నియోజక వర్గ పరిధిలోని పామూరు, కనిగిరి, వెలిగండ్ల, హెచ్‌ఎం.పాడు, సిఎస్‌.పురం, పిసిపల్లి మండలాలకు చెందిన కదిరి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ అధిష్టానం తనకు టికెట్‌ కేటాయిస్తానని చెప్పడంతో గతనాలుగేళ్లుగా పార్టీకి ఎనలేని కషి చేశానన్నారు. బీసీ సామాజిక వర్గానికి దద్దాల నారాయణ యాదవ్‌కు కనిగిరి టికెట్‌ కేటాయించాలని తనకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. మరొకసారి అధిష్టానం ఆలోచించి తనకు టికెట్‌ కేటాయిస్తే గెలిచి చూపిస్తానని తెలిపారు. ఇటీవల క్రితం కనిగిరిలో నిర్వహించిన దద్ధాల పరిచయ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైసిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ దద్దాల నారాయణయాదవ్‌ని గెలిపించాలని ప్రకటించడంతో తనకు టికెట్‌ వస్తుందని నమ్మకం పూర్తిగా పోయిందన్నారు. ఈ సందర్భంగా బాబూరావు అభిమానులు మాట్లాడుతూ ఇప్పుడే ఏదో ఒకటి తేల్చాలని పట్టుబట్టారు. ఇండిపెండెంట్‌గా లేదా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలని కోరారు. అభిమానులు సమయ్వనం పాటించాలని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అంతవరకు వేచి ఉండాలన్నారు. ముఖ్యమంత్రిపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఎమ్మెల్యే సీటు కంటే ఇంకా పెద్దపదవి కూడా రావచ్చేమోనని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబూరావు అభిమానులు పాల్గొన్నారు.

➡️