త్వరలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం: తాటిపర్తి

ప్రజాశక్తి-పెద్దారవీడు: పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తారని వైపాలెం వైసిపి అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం పెద్దారవీడు మండలం తోకపల్లిలో యోగానంద నరసింహస్వామి పుట్ట తిరుణాల సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించిన అనంతరం రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాటకచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వై పాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించటమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. వైసిపి పేదల పార్టీ అని, పేదల కోసమే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల కల నెరవేరబోతోందన్నారు. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటివారంలో వెలిగొండ ప్రాజెక్టును సిఎం ప్రారంభిస్తారన్నారు. జరగబోయే ఎన్నికల్లో వైసిపి విజయఢంకా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, జడ్‌పిటిసి యేరువ చలమారెడ్డి, స్టేట్‌ ఇరిగేషన్‌ డైరెక్టర్‌ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, సర్పంచులు జిల్లెల మల్లేశ్వరి, అంగిరేకుల ఆదినారాయణయాదవ్‌, తోకల ఆవులయ్య యాదవ్‌, వెన్నా శివకృష్ణారెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు బుజ్జి, యువజన విభాగం అధ్యక్షులు దుగ్గెం దినేష్‌, ఎస్సీ సెల్‌ నాయకులు పి గురవయ్య, వల్లెల ఈశ్వర్‌రెడ్డి, కాశయ్య, అంకయ్యయాదవ్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ శొంటి నాగార్జునరెడ్డి, వైసిపి నాయకులు శొంఠి వెంకటేశ్వర్లురెడ్డి, జిల్లెల పెరెడ్డి, మేకల లక్ష్మీనారాయణ, నరాల రామచంద్రయాదవ్‌, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️