నిధులు దారిమళ్లింపుపై సర్పంచ్‌ల ఆందోళన

కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన రాజేంద్ర ప్రసాద్‌, సర్పంచ్‌లు,

ప్రజాశక్తి-అనకాపల్లి

కేంద్రం ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టర్‌ కార్యాలయం వద్ద పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యాన జిల్లాలోని సర్పంచ్‌లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సమయంలో కలెక్టరేట్‌ నుంచి బయటకు వచ్చిన వైసిపి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ సర్పంచుల న్యాయమైన 16 డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను తక్షణమే సర్పంచుల పిఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా నాయకులు చింతకాయల సుజాత ముత్యాలు, వానపల్లి లక్ష్మి ముత్యాలరావు, వినోద్‌ రాజ్‌, మోటూరి సన్యాసినాయుడు, దాడి ఎరుకు నాయుడు, గొర్రిపాటి వెంకటలక్ష్మి, సన్యాసినాయుడు, జిల్లా వ్యాప్త సర్పంచులు పాల్గొన్నారు.

➡️