నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఆశాల నిరసన

Feb 10,2024 00:18

ప్రజాశక్తి – తుళ్లూరు : తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల నిరసన తెలిపేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టగా ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, నోటీసులు ఇవ్వడం, అడుగడుగునా అడ్డంకులు కల్పించడాన్ని ఆశాలు తప్పుబట్టారు. స్థానిక గ్రంధాలయం సెంటరు వద్ద శుక్రవారం నిరసనకు దిగారు. సిఐటియు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.భాగ్యరాజు మాట్లాడుతూ సమస్యలు గురించి జగనన్నకు చెబుదాం.. అని విజయవాడకు వెళుతున్న ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. నాయకులను అక్రమంగా అరెస్ట్‌ చేసి వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశాలకు నిర్దిష్టంగా పనిగంటలు లేవని, ఆదివారం, పండుగ రోజుల్లో సైతం సెలవులు లేవని, వెట్టిచాకిరి చేసినా పని భద్రత లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదన్నారు. ఆశాలకు కనీస వేతనం చెల్లించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, పని గంటలు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. మల్లిక, రెబ్కా, లక్ష్మి, తులసి, రేణుక పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : ఆశాలు విధులు బహిష్కరించి ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు మాట్లాడుతూ నిరసన తెలిపినా ప్రభుత్వం సహించలేకపోతోందని అన్నారు. కె.లక్ష్మి, రేణుక, కన్యాజ్యోతి, వినోదకుమారి, విజయలక్ష్మి, కరుణ, జయశ్రీలక్ష్మి, సుమతి, సుగుణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మేడికొండూరు :తమ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఆశాలు వినతిపత్రం ఇచ్చారు. యూనియన్‌ మండల అధ్యక్షులు టి.ధనలక్ష్మి, ప్రజా సంఘాల మండల కన్వీనర్‌ బి.రామకృష్ణ మాట్లాడుతూ నిర్బంధాలపై పెట్టే శ్రద్ధ సమస్యల పరిష్కారంపై పెడితే బాగుంటుందన్నారు. నాయకులపై కేసులు ఎత్తేయాల న్నారు. కార్యక్రమంలో చెన్నమ్మ, వి.సరళ కుమారి, టి.అనూష, కె.రాణి, నాగేంద్రం, వెంకాయమ్మ, ఎలిసెమ్మ, సుజాత, శంషాద్‌, అరుణకుమారి, సంధ్య పాల్గొన్నారు.

➡️