నూతన రహదారులు ప్రారంభం

Feb 11,2024 20:04

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 4,5 డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులను ఆదివారం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. బాబా మెట్టలోని ద్వారకా నగర్‌ లోనూ, కొత్తపేట లోని విజయలక్ష్మి నగర్‌లోనూ నూతనంగా ఏర్పాటు చేసిన రహదారులను ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లకు కార్పొరేటర్లు గాదం మురళి, మారోజు శ్రీనివాసరావు, వైసిపి నాయకులు గదుల సత్యలత, వీర్రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి నగర అభివృద్ధే ధ్యేయంగా కషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వివి రాజేష్‌, కెఎపి రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️