నోరు అదుపులో పెట్టుకోండి : ఎమ్మెల్యే

Mar 31,2024 21:37

ప్రజాశక్తి – వినుకొండ : వైసిపి నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై టిడిపి నేతలైన లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు దుష్ప్రచారాన్ని సహించబోమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసభ్యకరమైన పదజాలంతో దూషణలకు దిగారు. స్థానిక వైసిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈపూరు మండలం కొండ్రముట్లలో ప్రచారానికి వెళ్లిన టిడిపి నేతలు అనిల్‌కుమార్‌ను కుక్క అంటూ తూలనాడారని, ఇతరులతోనూ ఆ మాట అనిపించారని అన్నారు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. వారు సభ్యత లేకుండా మాట్లాడ్డం వల్ల తానూ అదేవిధంగా మాట్లాడుతున్నానని దూషించారు. ఎక్కువగా మాట్లాడితే తానేంటో చూపిస్తానని, తననెవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు. టిడిపి నాయకులు తమ తీరు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

➡️