పల్నాడులో 1,22,000 ‘ఆరోగ్య శ్రీ’ కార్డులు పెండింగ్‌

‘నగరోదయం’లో భాగంగా సత్తెనపల్లిలో ఇళ్ళ రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌

సత్తెనపల్లి రూరల్‌: పల్నాడు జిల్లాలో లక్షా ఇరవై రెండు వేల ఆరోగ్య శ్రీకార్డులు పెండింగ్‌లో ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ వెల్లడించారు.నగరోదయం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలోని 25 వార్డులో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో ‘నగ రోదయం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీకార్డులు ఎంతమందికి పంపిణీ చేశారని అధికారులను అడిగి తెలుసు కున్నారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్ళు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయా లని ఆదేశించారు. సత్తెనపల్లి లో 90 శాతం వరకు ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేశారని పేదలందరికి ఇళ్ళు రిజిస్ట్రేషన్‌ 90 శాతం పూర్తయినట్లు చెప్పారు. జిల్లా లోని బాలికలు రక్తహీనతతో బాధ పడుతున్నారని వారికీ పౌష్టికాహారం అందజేస్తున్నామని, బంగారు తల్లి పథకం కింద వారికి కార్డులు పంపిణీ చేసి అందులో రక్త పరీక్షల వివరాలు నమోదు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. కార్య కమంలో ఆర్డీవో వి.మురళీకృష్ణ, మున్సి పల్‌ కమిషనర్‌ కె.షమీ, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ లక్ష్మి తులసి, కౌన్సిలర్‌ అచ్యుత శివప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️