పాఠశాలలో ఎంఇఒ తనిఖీ

Feb 13,2024 21:53
ఫొటో : విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

ఫొటో : విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ
పాఠశాలలో ఎంఇఒ తనిఖీ
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని దుర్గంపల్లి మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎంఇఒ-1 షేక్‌ మస్తాన్‌ వలీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అభ్యాసన పఠనా సామర్థ్యాలు నైపుణ్యాలను పరిశీలించి విద్యార్థులు స్థాయిని కంటే మిన్నగా ఉన్నాయని పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పరిసరాలను అన్వాయిస్తూ కృత్యాధార బోధన చేయడం ఫజిల్స్‌ ద్వారా గణితాన్ని బోధించడంతో విద్యార్థులలో సృజనాత్మకత విలువల స్థాయి నైపుణ్యాలు మెరుగుపడతాయని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూస్తూ విద్యార్థులను రుచిని ఎలాగా ఉందని ప్రశ్నించారు. వారు ఆనందం వ్యక్తం చేయగా మధ్యాహ్న భోజన నిర్వహణను అభినందించారు. మెనూ ప్రకారం ప్రతిరోజు రుచితో కూడిన భోజనాన్ని తయారు చేయాలన్నారు. మొదటిగా పాఠశాలలోని అన్ని రికార్డులను తనిఖీ చేసి పాఠశాలలో జరుగుతున్న మనబడి నాడు-నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాఫర్‌ అహ్మద్‌, ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️