పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ప్రజాశక్తి-పొదిలి: పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామనే హామీని చేర్చాలని కోరుతూ యుటిఎఫ్‌ పొదిలి డివిజన్‌ ఆధ్వర్యంలో జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌, జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్‌ హై, జిల్లా కార్యదర్శి పి బాల వెంకటేశ్వర్లు నాయకత్వంలో పొదిలి పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలుసుకొని వారి వారి ఎన్నికల మేనిఫెస్టోలలో చేర్చాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ‘ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌’ అనే నినాదంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ అయితే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు పాత పెన్షన్‌ అమలు చేస్తామని హామీ ఇస్తామని ప్రకటిస్తాయో, ఆ రాజకీయ పార్టీకి ఉద్యోగులు, ఉపాధ్యాయ వారి కుటుంబాలు మొత్తం ఓట్లు వేసి మద్దతు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ లింగయ్య, సిహెచ్‌ కోటేశ్వరరావు, పొదిలి మండల ప్రధాన కార్యదర్శి పాలడుగు వెంకటేశ్వర్లు, కొనకనమిట్ల అధ్యక్షులు కే నాసర్‌ మహమ్మద్‌, కోనంకి సంజీవరావు, పచ్చవ ఆంజనేయచౌదరి ముతుకుమలి శ్రీనివాసరావు, దేవిరెడ్డి నారాయణరెడ్డి, తాళ్లూరి నరసింహారావు, కూడలి నాగరాజు, బొజ్జ కృపారావు, కొమ్ము రమేష్‌, వంకాయలపాటి భాస్కరరావు, పి రహీం, ఎంజి సంధాని, లుక్కాని వెంకటేశ్వర్లు, ఎం నాగార్జునరావు, పెన్షనర్స్‌ సంఘం నాయకులు మదార్‌వలి పాల్గొన్నారు.

➡️