పింఛన్లు సత్వరమే అందజేయాలి : జగదీశ్వరి

Apr 2,2024 21:01

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శుల ద్వారా పెన్షన్‌దారులకు చెల్లింపులు సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎంపిడిఒ జగదీష్‌కుమార్‌కు మంగళవారం వినతి అందించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి సొంత కాంట్రాక్టుర్లకు రూ.13వేల కోట్ల బిల్లులు చెల్లింపు జరగడంతో ఖజానా ఖాళీ అయిందన్నారు. దీంతో వికలాంగులు, వృద్ధులకు పెన్షన్‌ అందించకపోవడం విచారకరమన్నారు. ఖజానాలో ఉన్న సొమ్ము ఖాళీ చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొందని ఆమె తెలిపారు. తప్పులు చేసిన జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షాలపై, కేంద్ర ఎన్నికల అధికారులపై తప్పును నెట్టేయడం సరైన పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాడి సుదర్శన్‌రావు, కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా కార్యదర్శి కె కళావతి, తిమ్మక ధర్మారావు, కిల్లక దాసు, కె వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలోని వితంతు, వృద్ధాప్య, వికలాంగ, తదితర పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించాలని స్థానిక ఎంపిడిఒ ఎంవిబి సుబ్రమణ్యంకు మండల టిడిపి అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, నీలకంఠనాయుడు, బల్ల హరిబాబు, టి రమేషు, వి.శ్రీనివాసరావు, శశి కుమార్‌ ఎన్‌, ఆర్‌ తాతబాబు, జి.గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు. సీతానగరం : ప్రతి లబ్ధిదారునికి ఇంటికి వెళ్లి పింఛను అందజేయాని మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు పెంట సత్యనారాయణ, ఆర్‌.వేణుగోపాల్‌ నాయుడు అన్నారు. ఈ మేరకు ఎంపిడిఒ ఈశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బి.శ్రీనివాసరావు, సర్పంచి జొన్నాడ తెరేజమ్మ, తదితరులు పాల్గొన్నారు. కురుపాం : వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్‌ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, మండల కన్వీనర్‌ కెవి కొండయ్య మంగళవారం స్థానిక ఎంపిడిఒ ఎస్‌.అప్పారావుకు వినతిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. పెన్షన్లను సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్దిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కర్రి శ్రీను, బోటు గౌరీ తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్‌ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టిడిపి క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గులిపల్లి సుదర్శనరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎంపిడిఒకు వినతిని అందజేశారు. వినతిని అందజేసిన వారిలో నంగిరెడ్డి మధుసూధనరావు, మండల ఉపాధ్యక్షులు పడాల హరి, యూనిట్‌ ఇంచార్జ్‌ బొంగు భానుజీ రావు, కుమ్మరి గుంట సర్పంచ్‌ గొర్లి లక్ష్మణ రావు, బత్తిలి శ్రీను, పాలక నూకరాజు, గులిపల్లి మురళి, మారిసర్ల సత్యనారాయణ, బిద్దిక తమ్మయ్య, నీరస శ్రీను,సర్పంచ్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️