పింఛన్ల కోసం డిప్యూటీ సిఎంకు మొర

Apr 2,2024 21:04

 ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పాంచాలిలో మంగళవారం డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు వితంతువులు, వికలాంగులు పింఛన్‌ ఇంకా అందలేదు దొర అంటూ పలువురు లబ్ధిదారులు రాజన్నదొరకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు ఒకటో తేదీ వేకువజామున వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించేవారని, అటువంటి వాలంటీర్లపై టిడిపి, జనసేన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి తొలగించారని, అందువల్లే మీరు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు అందవని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు నారాయణరావు, పెద్దిబాబు, పి.వీరమనాయుడు, మండల వైసిపి అధ్యక్షులు గొట్టాపు ముత్యాలునాయుడు, ఎంపిటిసిలు, సర్పంచులు, గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️