పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి: కలెక్టర్‌

Feb 29,2024 21:54

3న పోలియో చుక్కలు
పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: మార్చి 3వ తేదీ 0-5 సంవత్సరం లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ ఎన్‌.షన్మోహన్‌ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో మార్చి 3వ తేదీన జరగబోయే పల్స్‌ పోలియో కార్యక్రమంకు సంబంధించి బ్యానర్‌లు, పోస్టర్స్‌ను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌.షన్మోహన్‌ మాట్లాడుతూ 0-5 సంవత్సరం లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని, పోలియో చుక్కలు వేయించుకొనేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు 4,5 తేదీలలో ఇంటింటికీ వెళ్లి వేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడే పుట్టినబిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు విధిగా అదనంగా ఈ పోలియోచుక్కలు వేయించాలని, తద్వారా పోలియో లేని సమాజ స్థాపనే లక్ష్యమన్నారు. జిల్లా మొత్తం మీద 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ కేంద్రాల పరిధిలో 8మంది ప్రోగ్రాం అధికారుల ద్వారా 142 రూట్లలో 1,415 కేంద్రాల ద్వారా 20,9971 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో 149 హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, వీటిని మొబైల్‌ బూత్‌ల ద్వారా కవర్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. వీటిని అన్నింటిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లా నోడల్‌ అధికారి మరియు వ్యాధినిరోధక టీకాల అధికారి పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ రవిరాజు, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, డిపిఎంఓ డాక్టర్‌ హర్షవర్ధన్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుదర్శన్‌, మున్సిపల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లోకేష్‌, ఎన్‌సిడి కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శిరీష, డెమో జయ రాముడు, ఏపీ డిమియాలజిస్ట్‌ శ్రీవాణి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. సోమల: మార్చి 3వ తేదీ నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమిష్టిగా కషి చేయాలని డిటి రామమూర్తి అన్నారు. గురువారం మండల కేంద్రమైన సోమల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కందూరు వైద్యాధికారిని విజయలక్ష్మి, పెద్ద ఉప్పరపల్లి వైద్యాధికారి బాలాజీ, ఎంఈఓ శివరత్నమ్మ, వైద్య సిబ్బంది కలసి పల్స్‌ పోలియో విజయవంతానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న విషయాలపై సమీక్ష నిర్వహించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించేందుకు క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు పూర్తిస్థాయిలో దష్టి సారించి విజయవంతం చేయాలని నిర్ణయించారు. బంగారుపాళ్యం: 3న పల్స్‌ పోలియో కార్యక్రమం జయప్రదం చేయాలని ఎంపీడీవో శివశంకర్‌ కోరారు. గురువారం మండల కార్యాలయంలో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వైద్యులు లోహిత్‌ చంగల్‌ రాయులు, రమేష్‌ పాల్గొన్నారు. చిత్తూరు డెస్క్‌: 3వ తేదీన నిర్వహించ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో సింగయ్య కోరారు. గురువారం యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి అనిల్‌ కుమార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో సిబ్బందికి పల్స్‌ పోలియోపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిహెచ్‌ఓ లక్ష్మీనారాయణ, సూపర్వైజర్‌ అనసూయమ్మ, లక్ష్మీపతి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️