పుల్లలచెరువులో ‘జయహో బీసీ’

ప్రజాశక్తి-పుల్లలచెరువు: సామాన్య కార్యకర్తనైన నేను నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గానికి సేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చాను. ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శుక్రవారం పుల్లలచెరువు మండల కేంద్రంలో జయహో బీసీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు, బీసీ వర్గాల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో గతంలో మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలుపొందలేకపోయిందన్నారు. ఈసారి టిడిపి నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ పయ్యావుల ప్రసాదు, నాయకులు కాకర్ల కోటయ్య, పొట్ల గోవిందు, మాజీ సర్పంచ్‌ వేముల కృష్ణయ్య, గజ్జవల్లి భాస్కరరావు, ఎల్లయ్య, ఇదెమ్మ, జనసేన మండల కన్వీనర్‌ కటారి కృష్ణ, ఆర్మీ బుజ్జి, నక్క ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️