పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం

Feb 12,2024 21:32
ఫొటో : మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయిని సిహెచ్‌ అనంతలక్ష్మి

ఫొటో : మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయిని సిహెచ్‌ అనంతలక్ష్మి
పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుందని, పుస్తకాలు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆభరణాలు అని ప్రధానోపాధ్యాయిని సిహెచ్‌ అనంతలక్ష్మి పేర్కొన్నారు. పట్టణంలోని గవర్నమెంట్‌ హైస్కూల్‌లో సోమవారం గ్రంథాలయానికి ఆమంచర్ల నటరాజన్‌ జ్ఞాపకార్థం వారి కుమార్తె సరళదేవి 300 పుస్తకాలు బహూకరించారు. నటరాజన్‌ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయిని నటరాజన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నటరాజన్‌ విద్యావేత్త, విద్యార్థుల శ్రేయస్సు కోసం పరితపించేవారని, మున్సిపల్‌ కమిషనర్‌గా వివిధ ప్రాంతాలలో అంకిత భావంతో పనిచేశారని ఆయన పుట్టినరోజున విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. నటరాజన్‌ కుటుంబ సభ్యులు వారి ఆశయాలను కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని అనంతలక్ష్మి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ మల్లికార్జున, సీనియర్‌ ఉపాధ్యాయులు బి సి పెంచలయ్య, తెలుగు పండితులు డాక్టర్‌ ఎం.ప్రసాద్‌, మధుసూదన శాస్త్రీ, తదితరులు పాల్గొన్నారు.

➡️