పేదల అభివృద్ధికి కృషి

Apr 1,2024 21:34
ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న వైసిపి నాయకులు

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న వైసిపి నాయకులు
పేదల అభివృద్ధికి కృషి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : పేదవారి కల వైసిపి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మెన్‌ గొల్లపల్లి విజరుకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మండలం కొత్తూరు గ్రామంలో వైసిపి నాయకులు బీమవరపు వెంకటకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి విజరు కుమార్‌ యాదవ్‌, కోఅపరేటివ్‌ బ్యాంక్‌ చెర్మన్‌ గుణపాటి సురేష్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న మేనిఫెస్టోను గూర్చి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డబ్బులకమ్ముడు పోయే నాయకులు పార్టీలు మారారు తప్ప నిజమైన వైసిపి నాయకులు, ప్రజలు మాత్రం తమ పార్టీని విడలేదన్నారు. పేదలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. పేదల అండ తమ పార్టీకి, తమనేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డికి ఉందన్నారు. కార్యక్రమంలో కొత్తూరు సర్పంచ్‌ ఈగ విజయమ్మ, లేబూరు వెంకీ రెడ్డి, వెళ్ళ బానునాయుడు, వాసు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️