పేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

ప్రజాశక్తి- కురిచేడు : పేదల సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ పదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా వాలంటీర్లు కృషి చేస్తున్నట్లు తెలిపారు.సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలన్నారు.దర్శిలో బూచేపల్లి శివప్రసాదర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వాలంటీర్లకు పురస్కారాలు అందజేసి సన్మానించారు. తొలుత కురిచేడు ప్రాథమిక వైద్యశాల ల్యాబ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాలను గురువారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిఎల్‌ఇఒ, సాయి కుమార్‌, జడ్‌పిటిసి నుసుం వెంకటనాగి రెడ్డి, సచివాలయ మండల కన్వీనర్‌ మేరువ సుబ్బరెడ్డి, కురిచేడు సర్పంచి కేశనపల్లి కెష్ణయ్య, నాయకులు గోగులముడి లింగా రెడ్డి, మేరువ పిచ్చిరెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మద్దిపాడు : మద్దిపాడులో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు పురస్కారాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైసిపి సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్‌ఛార్జి మేరుగ నాగార్జున, ఎంపిపి వాకా అరుణ కోటి రెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, ఆయా గ్రామాల సర్పంచులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️