పేదల సంక్షేమానికి కృషి

ప్రజాశక్తి- నాగులుప్పలపాడు : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైసిపి సంతనూతలపాడు నియోజక వర్గ అభ్యర్థి మేరుగ నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని చదలవాడ గ్రామంలో మంత్రి ఆదివారం పర్యటించారు. తొలుత ఎస్‌సి కాలనీలోని అంబేదర్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, ఎంపిపి నలమలపు అంజమ్మ కష్ణారెడ్డి, సర్పంచి దాసరి వరప్రసాదు ,కష్ణయ్య, జెసిఎస్‌ కన్వీనర్‌ కొమ్మూరి సుధాకర్‌ రావు, పోలినేని కోటేశ్వరరావు, పక్కెల వజ్రం బాబు, కోయి హనుమయ్య,పేరాల చెన్నకేశవులు మాదాసు రాంబాబు పాల్గొన్నారు.

➡️