పోటాపోటీగా ఫ్లెక్సీలు

Feb 5,2024 20:51
  • పోటాపోటీగా ఫ్లెక్సీలు
  • ‘సిద్ధం’ అని ఒకరు.. ‘సంసిద్ధం’ ఇంకొకరు

ప్రజాశక్తి- కుప్పం: అధికార ప్రతిపక్షాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎత్తులకు పైఎత్తులకు సిద్ధమయ్యారు. స్తబ్దుగా ఉన్న ప్రజాదృష్టిని తమ వైపునకు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ‘సిద్ధం’ పేరిట అధికార పార్టీ పోస్టర్లు ఆవిష్కృతం కాగా పోటీగా ప్రతిపక్ష ఉమ్మడి జనసేన, టీడీపీకి చెందిన ‘సంసిద్ధం’ పోస్టర్లు అంతటా వెలుస్తున్నాయి. రాష్ట్రమంతటా ఎలా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పోటీపోటీగా ఆయా పార్టీ నేతలు ఈ పోస్టర్లును ఎక్కడచూసినా అంటిస్తున్నారు. దీంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

➡️