ప్రకృతి సాగు పరిశీలన

Feb 12,2024 21:31

ప్రజాశక్తి-వేపాడ  : మండలంలోని కుమ్మపల్లి గ్రామంలో ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తున్న పంటలను రైతు సాధికార సంస్థ ఇవిసి విజరు కుమార్‌ ఆధ్వర్యాన అమెరికా, కర్ణాటక బృందం సోమవారం పరిశీలించింది. వారితో డిపిఎం ఆనంద్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రకృతి సాగువల్ల కలిగే ప్రయోజనాలను సభ్యులకు వివరించారు. నవధాన్యాల సాగు, కషాయాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి రామారావు, రీజనల్‌ కోఆర్డినేటర్‌ కృష్ణారావు, ఆర్‌టిఎల్‌ ప్రకాశ్‌, ఆర్‌టిఒ హేమసుందర్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం దుంగాడ గ్రామంలో అమలవుతున్న ఫుడ్‌ బాస్కెట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజరు కుమార్‌, ఎన్‌ఎఫ్‌ఎ జాహ్నవి కలిసి ఫుట్‌ బాస్కెట్‌ కార్యక్రమం అమలు గురించి అమెరికా బృందానికి వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

➡️