ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కార్మిక సం ఘాలు, ప్రజాసంఘాల నాయకులు

పిడుగురాళ్ల : ఈనెల 16న  గ్రామీణ బంద్‌, పారి శ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని కన్నెగంటి హనుమంతు భవనంలో కార్మిక సం ఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి, ప్రజలపై భారాల మోపుతోందని, పభుత్వ ఆస్తులను కార్పో రటర్లకు కట్టబెట్టే విధానాలను అవలం బిస్తోందని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయం దెబ్బతిందని వ్యవసాయ కూలీలకు పనులు తగ్గిపోయా యని చెప్పారు. డిమాండ్ల సాధన కోసం ఎఐఎఫ్‌టియు నాయకులు నీలాద్రి రాం బాబు మాట్లాడుతూ16న జరగనున్న సమ్మెలో కార్మికులు రైతులు ,వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎఐటియుసి నాయ కులు జె.కృష్ణ నాయక్‌ మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం పోరాడే వారిపై నిర్బం ధాలు, అక్రమ అరెస్టులు, కేసులు బనాయించడం తగదని అన్నారు. అనం తరం కరపత్రాలను విడుదల చేశారు. సమావేశానికి బత్తుల వెంకటేశ్వర్లు అధ్య క్షత వహించారు. సమావేశంలో భారత బచావో నాయకులు ఎస్కే సర్దార్‌, సిఐ టియు నాయకులు వెంకటకృష్ణ, షేక్‌ బాబు, రామకృష్ణ, శ్యాంకోటి,సుందర్‌ రావు, టి.పద్మ, ఇంజనీరింగ్‌ కార్మికులు ప్రతాప్‌ కుమార్‌, వెలుగొండయ్య పాల్గొన్నారు.

వినుకొండ: ఈనెల 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని వినుకొండ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 ,000 అమలు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కడప ఉక్కు నిర్మించాలని,కార్మికులకు పని భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు సంపెంగల అబ్రహం రాజు, పచ్చి గొర్ల ఏసు, రాచపూడి ఏసుపాదం, కంచర్ల కోటేశ్వరరావు, వెలుగొండ యెహౌషువ, తదితరుల కార్మికులు పాల్గొన్నారు.

కారంపూడి: అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుమేరకు సోమవారం కారంపూడి లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ పార్టీ,సిపిఐ ఎంఎల్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేకపోతు శ్రీనివాసరెడ్డి, సిపిఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డలు నాగేశ్వరావు మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పి కొట్టాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి షేక్‌. సైదా, రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు జక్కంపూడి. పద్మ, కాంగ్రెస్‌ నాయకులు నాగేటి కొండలు, సిపిఐ మండల సహయ కార్యదర్శి కె. వెంకటశివయ్య, సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, రామ్మూర్తి పాల్గొన్నారు.

➡️