ప్రజా సమస్యలు పెరిగిపోయాయి

పౌర హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్ర శేఖర్‌ప్రజాశక్తి-రాయచోటి రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోయాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రాయచోటి ఎన్‌జిఒ హోమ్‌లో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కడప జిల్లా 11వ మహాసభలు జిల్లా కార్యదర్శి ఆర్‌. రవిశంకర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 50 వసంతాల హక్కుల ఉద్యమ ప్రస్థానం గురించి ప్రసంగించారు. 1970 లలో శ్రీకాకుళం రైతాంగ పోరాటాల వల్ల రాష్ట్రం అట్టుడికి పోయిందని, అప్పటి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉద్యమకారులపై హింసను ప్రయోగించి ఎన్‌కౌంటర్లకు పాల్పడిందని వాపోయారు. ఈ నేపథ్యంలో 1973 డిసెంబర్‌ 23న గుంటూరులో శ్రీశ్రీ అధ్యక్షతన పౌరహక్కుల సంఘం ఏర్పాటు ఆవిర్భవించిందని చెప్పారు. మొదట్లో ప్రభుత్వం ప్రజలపై సాగిస్తున్న ధమన కాండ నిరసిస్తూ సంస్థ విస్తత సమస్యలపై పోరాటాలు చేసింది అన్నారు. ఈ క్రమంలోనే రాజ్యం, హిందూ మతోన్మాదుల దాడులలో సంస్థ ఆరుగురు నాయకులను కోల్పోయిందని చెప్పారు. ప్రభుత్వం రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా చట్టబద్ధ పాలన చేయడం లేదని వాపోయారు. చట్టం ఉన్నది కేవలం భూస్వామ్య, పెట్టుబడిదారి, పాలకులకు మాత్రమేనని, పేదలకు ఏమాత్రం కాదని పేర్కొన్నారు. ఉన్నవారికి అనుకూలంగా ప్రభుత్వ పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి. వరలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు ఏమాత్రమూ ప్రజా సమస్యలు తీర్చ లేదని, ప్రజలు ఎదుర్కొ ంటున్న సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా దాడి చేస్తూ వారిని అణిచివేస్తున్నారని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో దేశంలో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారుని తెలిపారు. మహాసభలలో పౌర హక్కుల సంఘం నాయకులు మనోహర్‌ రెడ్డి, సురేష్‌, రవిశంకర్‌, రెడ్డయ్య ,పుల్లయ్య చైతన్య మహి ళా సంఘం రాష్ట్ర నాయకురాలు పద్మ, జిల్లా కార్యదర్శి ఝాన్సీ లక్ష్మి, దళిత హక్కులపోరాట సమితి నాయకులు సుధీర్‌, సిపిఐ నాయకులు విశ్వ నాథనాయక్‌, భారతీయ అంబేద్కర్‌ సేన పల్లం తాతయ్య, దళిత మిత్ర నాయకులు శంకర య్య, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక : జిల్లా నుతన ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.రవిశంకర్‌, జిల్లా అధ్యక్షులుగా యం.సురేష్‌, ఉపాధ్యక్షులుగా పి. రెడ్డయ్య, కోశాది óకారి కె.మనోహర్‌ రెడ్డి సంయుక్త కార్యదర్శి యం. రవిశంకర్‌, కార్యవర్గ సభ్యులుగా యస్‌ .పుల్లయ్య, వి.మనెమ్మ,సి.వెంకటేశ్వర్లు ఎన్నుకున్నారు.

➡️