ప్రణాళిక బద్ధంగా చదివితేనే మంచి ఫలితాలు

ప్రజాశక్తి -కనిగిరి : పదో తరగతి విద్యార్థులు సమయస్ఫూర్తితో రోజుకు 18 గంటల పాటు మనసుపెట్టి చదివితే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించవచ్చునని జెవివి నాయకుడు షేక్‌ గయాజ్‌ బాషా తెలిపారు. కనిగిరి పట్టణంలోని మాంటిస్సోరీ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గయాజ్‌ బాషా మాట్లాడుతూ 24 గంటల్లో 18 గంటలు మనసుపెట్టి చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మితంగా ఆహారం తీసుకొని ఓ పద్ధతి ప్రకారం పరీక్షలు అయ్యేవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. విద్యార్థులకు మొబైల్‌ ఫోన్లకు అడిక్ట్‌ అయ్యారని దానివల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతుందన్నారు. టీవీలో సినిమాలు చూడకుండా పూర్తి దష్టి పరీక్షల మీద పెట్టి బాగా అన్ని సబ్జెక్ట్‌ లలో ఒక రివిజన్‌ ప్రకారంగా చదువుకుంటే మంచి మార్కులు సాధిస్తారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామినేషన్‌ హాల్‌లో ధైర్యంగా ఉండాలన్నారు. సమయాన్ని వినియోగించుకోవాలని, హ్యాండ్‌ రైటింగ్‌ బాగా స్పీడుగా రాయగలిగితే తప్పనిసరిగా సమయం ఆదా అవుతుందన్నారు. చక్కని చేతి రాతను ప్రాక్టీస్‌ చేస్తే బాగుంటుందనిసూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుల్లారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️