ప్రతిపక్షాలు ఏకమైనా వైసిపిదే గెలుపు

Feb 13,2024 21:57
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
ప్రతిపక్షాలు ఏకమైనా వైసిపిదే గెలుపు
ప్రజాశక్తి-కోవూరు : చిత్త శుద్ధితో ప్రజా సంక్షేమం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న వైసిపి ప్రభుత్వంను ఎవరు కూలదొయ్యడానికి ప్రయత్నం చేసిన అధికారం చేపట్టేది జగన్‌మోహన్‌ రెడ్డేనని ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి స్పష్టత వ్యక్తం చేశారు. మంగళవారం కోవూరులోని పి వి ఆర్‌ కళ్యాణ్‌ మండపంలో జరిగిన కోవూరు మండలం స్థాయిలో ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ సర్కార్‌ చేపట్టి 4యేళ్ల 9నెలలు వ్యవదిలో అనేక సంక్షేమం అభివృద్ధి అవినీతికి ఆస్కారం లేకుండా జరిగిందన్నారు. ఓట్లు అడిగే ధైర్యం వైసిపి నాయకులకు ఉందన్నారు. కనీవిని ఎరుగని రీతిలో ఎనలేని సంక్షేమ ఫలాలు నేరుగా వారి వారు ఖాతాలోనే జమ చెయ్యడంపై ప్రజలు ఆకర్షితులు అయ్యారన్నారు. టిడిపికి రాష్ట్ర స్థాయిలో క్షేత్ర స్థాయినుండి బలమైన కేడర్‌ లేదన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి కరోనా సమయంలో కూడా ఏ పథకాన్ని అపకుండానే మరోవైపు ఆర్థిక మాంథ్యం తట్టుకొని ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం అని అన్నారు. ఒక కుటుంబ సభ్యులుగానే ఉండి తనను ఎంపిని అత్యతిక మెజారిటీని ఎన్నికల్లో ఇస్తారని తనకు నాయకులపై నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు, డిఎఎబి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌ బాబురెడ్డి, ఎఎంసి చైర్మన్‌ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్‌ రామ్‌రెడ్డి మల్లికార్జున్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి శివుని నరసింహారెడ్డి, మండల కన్వీనర్‌ నలబోలు సుబ్బారెడ్డి, డిఎల్‌డిఎ డైరెక్టర్‌ కాటంరెడ్డి దినేష్‌ రెడ్డి, జెడ్‌పిటిసి కవగిరి శ్రీలత, ఎంపిపి తుమ్మలపెంట పార్వతి, సచివాలయంలో కన్వీనర్‌ కవరిగిరి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️