ప్రతి మహిళా స్వశక్తితో ఎదగాలి

Apr 1,2024 21:38
ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌

ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌
ప్రతి మహిళా స్వశక్తిగా ఎదగాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రతి మహిళా స్వశక్తితో ఎదగాలని టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్‌ పేర్కొన్నారు. సోమవారం వింజమూరు మండలం బొమ్మరాజు చెరువులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా నేతల ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాకర్ల హాజరై మాట్లాడుతూ మహిళలకు ఆస్తిహక్కు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెద్దపేట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. మహిళలకు నియోజకవర్గంలోని ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తానన్నారు. అందుకోసం ఎనిమిది మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు బాగుపడతాయన్నారు. కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా పలువురు మహిళలకు టైలరింగ్‌ బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేశామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించారని, తద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ విధానాన్ని తుంగలో తొక్కి రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. మైనార్టీ సోదరీమణుల కోసం ప్రత్యేకంగా పథకాలు ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీలకు అండగా టిడిపి ఉంటుందన్నారు. రానున్న ఎన్నిక నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మహిళలు ముక్తకంఠంతో అన్నారు. కార్యక్రమంలో సీతారాంపురం మాజీ జెడ్‌పిటిసి కలివెల జ్యోతి, ఎస్‌టిసెల్‌ అధ్యక్షురాలు జయలక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి శాంతమ్మ, అరుణ, మనిషా, నాదెండ్ల రమాదేవి, అంకమ్మ, రాజేశ్వరి, శాంతి, ప్రసన్న, టిడిపి మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️