ప్రభుత్వాల విధానాలతో రైతులు, కార్మికులకు ఇబ్బంది

అఖిలపక్ష సమావేశంలో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

చిలకలూరిపేట : సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సం ఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీన భారత గ్రామీణ బంద్‌, పారిశ్రామిక వాడల్లో సమ్మె చేయనున్నట్లు అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్‌టి సెంటర్‌ లోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశా నికి ఎఐటియుసి ఏరియా సమితి కార్యదర్శి నాగబైరు సుబ్బాయమ్మ అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా సమ్మె కరపత్రా లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 13వ తేదీన జీపు ప్రచారం చిలకలూరిపేట, మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న రైతాంగ వ్యతిరేక,పట్టణ పారి శ్రామిక విధానంతో రైతులు,కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, పరిశ్రమలు మూసి వేస్తున్న పట్టించుకోని విధానాలకు నిరిసిస్తూ నిర్వహించే ఈ బంద్‌, సమ్మెలో రైతులు, కర్షకులు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల రుణమాఫీ చేయాలని, కేరళ తరహా రుణ ఉపశమన చట్టం చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో రెండు లక్షల కోట్లు కేటా యించాలని, రెండు వందల రోజులకు ఉపాధి హామీ పెంచాలని, కనీస వేతనం రూ.600 గాను, రెండు పూటలా పని విధా నాన్ని అమలు చేయాలని, ఆన్లైన్‌ మస్టర్‌ రద్దు చేయాలని డి మాండ్‌ చేశారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్ట పరచాలన్న మొదలైన డిమాండ్లు చేశారు. 15 అం శాలతో కూడిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి మద్దతు తెలిపాయి. స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి కళామందిర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ జరుగనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతులు, కార్మికులు అఖిల పక్ష పార్టీలు,దళిత,గిరిజన, ప్రజాసం ఘాలు పాల్గొని జయప్రదం చేయాల న్నారు. సమావేశంలో సిఐటియు కన్వీనర్‌ పెరుబోయిన వెంకటేశ్వర్లు, సాతు లూరి లూథర్‌, అన్ని సంఘాల నాయ కులు, రాజ కీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అమరావతి: దేశ కార్మిక హక్కులు కాలరాస్తూ కిసాన్‌ మోర్చా రైతాంగానికి ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు రైతాంగ కార్మిక సంఘాలు ఈనెల 16వ తేదీన నిర్వహిస్తున్న గ్రామీణ బందును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బైరా పట్నం రామకృష్ణ పిలుపునిచ్చారు ఆదివారం మండల కేంద్రమైన అమరావతిలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి పెద్దకూరపాడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ఏఐటీయూసీ నాయకులు మునగోటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఏరియా కార్యదర్శి బిసూరిబాబు మాట్లాడారు.

➡️