ప్రశాంతంగా గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ-గోదావరి) : గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.పట్టణంలో శ్రీ సూర్య డిగ్రీ జూనియర్ కళాశాల , శ్రీ వైన్ కళాశాలలో మండలంలోని సీతారామపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు .అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చారు.పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.నరసాపురం ఆర్డీఓ ఎం. ఏ.అంబరీష్ డిఎస్పీ కె.రవి మనోహరి చారి తో కలిసి 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేసారు. స్వర్ణాంధ్ర కళాశాలలో పరీక్ష కేంద్రంలో మొత్తం అభ్యర్థులు 1000 హాజరు కావాల్సి ఉండగా 750 హాజరు అయ్యినట్లు ,250 మంది గైర్హాజరు అయ్యినట్లు ఎమ్మార్వో ఎన్ఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు.శ్రీ సూర్య కళాశాలలో 300 హాజరు కావాల్సి ఉండగా 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. శ్రీ వైన్ కళాశాలలో 500 మందికి 413 మంది హాజరయ్యారు.మొత్తం మూడు పరీక్ష కేంద్రాలలో 1800 మంది హాజరు కావాల్సి ఉండగా 1413 మంది హాజరయ్యారు.387 మంది గైర్హాజరు అయ్యినట్లు నరసాపురం ఆర్డీఓ ఎం. ఏ.అంబరీష్ తెలిపారు.

➡️