ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పుస్తకావిష్కరణ

Feb 11,2024 20:06

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భారతీయ భాషల పునరుద్ధరణకు పరిశోధనలు విస్తత స్థాయిలో జరగాలని, ఈ దశలో పత్రికల పాత్ర ఎంతో ముఖ్యమని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య టివి కట్టిమని అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆవశ్యకతపై డాక్టర్‌ బొండా రామకృఫ, డాక్టర్‌ చల్లా కృష్ణవీర్‌ అభిషేక్‌ రాసిన ‘ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఇట్స్‌ రిలవెన్సెస్‌ అనే పరిశోధన పుస్తకాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్‌ చల్లా రామకృష్ణ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగింది. అంతరించిపోతున్న గిరిజన భాషల పునర్జీవనానికి సెంటర్‌ ఫర్‌ ఎమోషనల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ వీర్‌ అభిషేక్‌ చేస్తున్న కృషిని వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కట్టిమని అభినందించారు.కార్యక్రమంలో రామకష్ణ, అభిషేక్‌ లు పాల్గొన్నారు.

➡️