ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం

Feb 12,2024 20:19

 ప్రజాశక్తి-విజయనగరం : స్పందన ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని పోలీసు అధికారులను జిల్లా అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందనలో భాగంగా సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా 41 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో విజయనగరం డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, డిసిఆర్‌బి సిఐ జె.మురళి, ఎస్‌బి సిఐలు కెకెవి విజయనాధ్‌, ఇ.నర్సింహమూర్తి, టాస్క్‌ఫోర్సు సిఐ కె.అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ ప్రభావతి పాల్గొన్నారు.

➡️