ఫిర్యాదులపై డిఎల్‌పిఒ విచారణ

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. అయితే ఉప్పగుండూరు సచివాలయ సిబ్బంది, కార్యదర్శికి మధ్య కొంతకాలంగా సఖ్యత లేదు. దీంతో సిబ్బంది కార్యదర్శి ప్రవర్తనపై జిల్లాకలెక్టరు దినేష్‌ కుమార్‌ , డిపిఒ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారి వారి ఆదేశాల మేరకు శుక్రవారం డిఎల్‌డిఒ ఉషారాణి శుక్రవారం విచారణ చేపట్టారు సిబ్బంది, కార్యదర్శిని విడివిడిగా విచారించారు. ఈ సందర్భంగా సచివాయల సిబ్బంది మాట్లాడుతూ విధుల నిర్వహణలో కార్యదర్శి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఓ యువకుడికి 21-9-2023న వివాహమైనట్లు తెలిపారు. ఆయువకుడు మార్యేజీ సర్టిఫికెట్‌ కోసం అర్జీ దాఖలు చేసినట్లు తెలిపారు. ఆ అర్జీ ప్రకారం వివాహం నాటికీ మైనారిటీ తీరలేదని తెలిపారు. దీంతో 2-11-2023 వివాహ మైనట్లుగా కార్యదర్శి రికార్డులో మార్చి సరిఫికెట్‌ మంజూరు చేసినట్లు తెలిపారు. జీతాల విషయంలో జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యలపై లిఖిత పూర్వకంగా డిల్‌పిఒ అర్జీ స్వీకరించారు. పంచాయతీ సిబ్బంది సమస్యల గురించి కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సర్పంచి దేవరకొండ జయమ్మ లిఖిత పూర్వకంగా డిల్‌పిఒకు ఫిర్యాదు చేశారు. కార్యదర్శి హరిబాబు సిబ్బంది సక్రమంగా విదులు నిర్వహించడంలేదని సమయ పాలన పాటించడం లేదని తెలిపారు. మ్యారేజ్‌ సర్టిపికెట్‌ పై తన కూడా సంతకం కూడా లేదని పేర్కొన్నారు. నివేదికను డిపిఒకు అందచేస్తానని డిఎల్‌డిఒ తెలిపారు.

➡️